నేరాలు అధికం.. అధికారి తాత్కాలికం
eenadu telugu news
Published : 23/09/2021 04:07 IST

నేరాలు అధికం.. అధికారి తాత్కాలికం

ఈనాడు, హైదరాబాద్‌: నిన్న భారీ చోరీ.. మొన్న సైబరాబాద్‌ కమిషనరేట్‌ పక్కనే ఉన్న బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం.. అంతకు ముందు పోలీసులకు భయపడి అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు.. ఇలా తరచూ ఏదో ఘటనతో వార్తల్లో నిలుస్తున్న అత్యంత కీలమైన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు పూర్తిస్థాయి ఇన్‌స్పెక్టర్‌(స్టేషన్‌ హౌజ్‌ అధికారి)ని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. సుమారు 4 నెలలుగా ఇన్‌ఛార్జితోనే నెట్టుకొస్తున్నారు. ఈ ఠాణా పరిధిలో ప్రముఖ ఐటీ కంపెనీలు, ప్రముఖుల నివాసాలున్నాయి. తరచూ.. వీఐపీల పర్యటనలుంటాయి. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న రవీందర్‌కు సుమారు 4 నెలల కిందట ఏసీపీగా పదోన్నతి లభించడంతో బదిలీ అయ్యారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.రాజగోపాల్‌రెడ్డికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. వారం.. పది రోజుల్లో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌హెచ్‌ఓగా వస్తారని భావించారు. తీరా నాలుగు నెలలుగా ఎవర్నీ నియమించలేదు. పైగా.. అంతకు ముందు ఆరుగురు ఎస్‌ఐలు పనిచేయగా, ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు పరిమితమైంది. ఇన్‌ఛార్జి సీఐ పని భారంతో తీరిక లేకుండా ఉంటున్నారు. ఆ ప్రభావం శాంతి భద్రతలపై పడుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని