పురాతన భవనం.. మత్తు పదార్థాల అడ్డా
eenadu telugu news
Published : 23/09/2021 04:07 IST

పురాతన భవనం.. మత్తు పదార్థాల అడ్డా

హబ్సిగూడ శ్రీనివాసపురంలో గంజాయి మొక్కల పెంపకం

హబ్సిగూడ, న్యూస్‌టుడే: హబ్సిగూడ డివిజన్‌ పరిధి శ్రీనివాసపురం పురాతన భవనం అది. నిత్యం సాయంత్రం, రాత్రి వేళల్లో యువత మద్యం తాగి రోజంతా అందులో గడుపుతున్నట్లు స్థానికులు బుధవారం ఆబ్కారీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తొలుత మత్తు పదార్థాల ఆనవాళ్లు గుర్తించారు. మూడో అంతస్తులో ఏకంగా గంజాయి మొక్కల పెంపకంతో అవాక్కయ్యారు. వాటితో పాటు ఖాళీ మద్యం సీసాలు, గంజాయి, డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పరిశీలనలో తేలింది. యంత్రాంగం అక్కడ చేరుకునే సమయానికి యువకులు పరారయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని