సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ను విచారించిన త్రిసభ్య కమిషన్‌
eenadu telugu news
Published : 23/09/2021 04:09 IST

సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ను విచారించిన త్రిసభ్య కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌ మూడో విడత విచారణ కొనసాగుతోంది. బుధవారం సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌కుమార్‌ను కమిషన్‌ తరఫు న్యాయవాది పరమేశ్వర్‌ పలు అంశాలపై ప్రశ్నించారు. ‘దిశ’ను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సమయంలో శ్రీధర్‌కుమార్‌ షాద్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. నిందితులను గ్రామాల్లో పట్టుకున్నప్పుడు అక్కడే అరెస్ట్‌ పంచనామా ఎందుకు రాయలేదని పరమేశ్వర్‌ ప్రశ్నించారు. జనం పెద్దఎత్తున గుమిగూడటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేదని శ్రీధర్‌కుమార్‌ బదులిచ్చారు. అంతకుముందు ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి పరిశీలకుడిగా, రికవరీ పంచనామా చేసిన బృందంలో సభ్యుడిగా ఉన్న ఫరూఖ్‌నగర్‌ గ్రామ రెవెన్యూ సహాయకుడు లింగంను న్యాయవాది ప్రశ్నించారు. ఘటనాస్థలి నుంచి తుపాకీ తూటాలు, ‘దిశ’ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని