ప్రతి ఆలయంలో జమ్మి చెట్లు
eenadu telugu news
Published : 23/09/2021 04:21 IST

ప్రతి ఆలయంలో జమ్మి చెట్లు


మొక్క నాటి నీరు పోస్తున్న శ్రీనివాస్‌ గుప్త

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టును ప్రతీ ఆలయంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త తెలిపారు. రాష్ట్రంలోని 1100 దేవాలయాల్లో 1100 జమ్మి మొక్కలను నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం సనత్‌నగర్‌లోని హనుమాన్‌ దేవస్థానంలో ఉప్పల శ్రీనివాస్‌ గుప్త 6 జమ్మి మొక్కలు, మోతీనగర్‌ హనుమాన్‌ ఆలయంలో 2 జమ్మి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో తెలంగాణాలో పర్యాటక రంగాన్ని కూడా అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవస్థానం ఈవో శ్రీనివాసరాజు, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి శ్రీనివాస్‌ గుప్త, వాసవి సేవాసమితి రాష్ట్ర నాయకులు మురారిశెట్టి సత్యనారాయణ, ఫెడరేషన్‌ సనత్‌నగర్‌ డివిజన్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని