‘ఎల్వీ ప్రసాద్‌’ సేవలను విస్తరించాలి
eenadu telugu news
Published : 23/09/2021 04:21 IST

‘ఎల్వీ ప్రసాద్‌’ సేవలను విస్తరించాలి


టెక్నాలజీ కేంద్రం వివరాలను మంత్రి కేటీఆర్‌కు వివరిస్తున్న వైద్యులు

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో మందికి మేలు చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఎవరూ కంటి సంబంధిత సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి సంస్థ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తోందని.. వికారాబాద్‌లోనూ సేవలను ప్రారంభిస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్‌ కార్పొరేషన్‌లోని దర్గాఖలీజ్‌ఖాన్‌(కిస్మత్‌పూర్‌)లో ఉన్న ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, గుళ్లపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ ఐ కేర్‌లో ‘పూర్ణిమ-రామం’ ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ డా.గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి, ప్రసంగించారు. కేంద్రం అందించే సేవలు, పనితీరును పరిశీలించారు. ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి సంస్థ వ్యవస్థాపకుడు డా.జీఎన్‌రావు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ప్రశాంత్‌ గార్గ్‌, వైస్‌ఛైర్మన్‌ రామం ఆత్మకూరి, పూర్ణిమ ఆత్మకూరి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని