జేఎన్‌టీయూ లోగో, నినాదం రచనకు పోటీ
eenadu telugu news
Published : 23/09/2021 04:21 IST

జేఎన్‌టీయూ లోగో, నినాదం రచనకు పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని లోగో తయారీ, నినాద రచన పోటీలకు యూనివర్సిటీ పిలుపునిచ్చింది. విశ్వవిద్యాలయం 1972లో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త లోగో, నినాదం అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ‘గేట్‌ వే ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ నినాదంతో కూడిన లోగో ఉంది. కొత్త లోగో, నినాద రచనలో విశ్వవిద్యాలయ పరిధిలో అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొనవచ్చని రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 లోపె pa2registrar@jntuh.ac.in లేదా dap@jntuh.ac.in లేదా jhub@jntuh.ac.in కు మెయిల్‌ చేయవచ్చన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని