పిడుగు పాటుకు రైతు బలి
eenadu telugu news
Published : 24/09/2021 00:45 IST

పిడుగు పాటుకు రైతు బలి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: పిడుగుపాటుకు ఓ రైతు పొలంలోనే మృత్యువాత పడిన విషాదకర ఘటన వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మానేపల్లి గ్రామానికి చెందిన ఆకుల చంద్రయ్య (55) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం 10 గంటలకు పశువులను మేపడానికి రెడ్డిగూడెం పరిసరాలకు వెళ్లాడు. సాయంత్రం భారీ వర్షం కురిసింది. 6 గంటలకు పశువులు ఇంటికి చేరుకోగా.. చంద్రయ్య రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. ఈ క్రమంలో తన సొంత పొలంలోనే పిడుగు పాటుకు గురై మృతి చెందిన కనిపించాడు. దీంతో వారి రోదనలు మన్నింటాయి. చంద్రయ్యకు భార్య రజిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. చంద్రయ్య మృతికి స్థానిక ఎంపీపీ స్వరూప, సర్పంచి వెంకటలక్ష్మి సంతాపం తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని