ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు
eenadu telugu news
Published : 24/09/2021 00:45 IST

ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు

కాగ్నా నది వద్ద ట్రాక్టర్‌

బిజ్వార్‌ (తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: పట్టపగలు.. జోరువాన.. ఇవేమి పట్టించుకోకుండా కొందరు అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. గమనించిన గ్రామస్థులు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ ఘటన తాండూరు మండలం బిజ్వార్‌ కాగ్నా నది వద్ద గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్వార్‌ శివారు కాగ్నా నదిలో నాయకుడు దగ్గరుండి పెద్దేముల్‌ మండలానికి చెందిన ఓ ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా తరలింస్తున్నారు. నదిలో నడుము లోతు నీరుండగా మహిళల చేత గంపల ద్వారా ఇసుకను ట్రాక్టర్‌లో వేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే కాగ్నా నది వద్దకు చేరుకొని ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కాగ్నా నుంచి అక్రమంగా ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని