మోసం చేసి.. మరో వివాహం
eenadu telugu news
Updated : 24/09/2021 11:03 IST

మోసం చేసి.. మరో వివాహం

కుటుంబ కలహాలతో రెండో భార్య ఆత్మహత్య

ఓ హోంగార్డు నిర్వాకమిది

కుల్కచర్ల, న్యూస్‌టుడే: అతనో హోం గార్ఢు. భార్యకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య ఆత్మహత్యకు కారకుడయ్యాడు.. కుల్కచర్ల మండలం మందిపల్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకున్న సంఘటన ఇది. ఎస్‌ఐ విఠల్‌ రెడ్డి కథనం ప్రకారం.. వడ్డె గోపాల్‌ షాద్‌నగర్‌లో హోంగార్డుగా విధులను నిర్వహిస్తున్నాడు. రెండు నెలల నుంచి విధులకు వెళ్లడం లేదు. షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన శిరీష (25)ను ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. అక్కడే కాపురం పెట్టాడు. ఆమెకూ ఇది రెండో వివాహం. ఇటీవలే గోపాల్‌ సొంతూరుకి వెళ్లిన సమయంలో రెండో పెళ్లి విషయం ఇంట్లో తెలిసింది. దీంతో మొదటి భార్య తరఫున పెద్దలు గ్రామంలో పంచాయతీ పెట్టారు. రెండో భార్యకు కొంత డబ్బును ఇచ్చి విడిపించుకోవాలని అతడికి సూచించారు. దీనికి ఒప్పుకున్న రెండో ఆమె డబ్బులను ఇవ్వాలని తరచూ కోరేది. వాటిని ఇవ్వడంలో అతను జాప్యం చేస్తూ వస్తున్నాడు. గురువారం మందిపల్‌ గ్రామానికి శిరీషతో వచ్చాడు. గోపాల్‌కు ఇద్దరు భార్యల మధ్య గొడవ జరిగింది. దీంతో కలత చెందిన శిరీష ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష మృతికి భర్త గోపాల్‌ కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని