దారికి కోత.. ప్రయాణానికి వెత
eenadu telugu news
Published : 24/09/2021 00:45 IST

దారికి కోత.. ప్రయాణానికి వెత

యాలాల మండలం ఎన్కేపల్లి, పేర్కంపల్లి గ్రామస్థులకు తాండూరు వెళ్లేందుకు అవస్థలు తప్పడంలేదు. ఏటా వర్షాకాలంలో జుంటిపల్లి ప్రాజెక్టు అలుగుపారి పేర్కంపల్లి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోతోంది. ఈ సారి భారీ వర్షాలతో మూడు సార్లు ఇదే విధంగా జరిగింది. ప్రమాదం అని తెలిసినా వరదలోనే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు వరద దాటుతూ అగ్గనూర్‌, ఎన్కేపల్లి పాఠశాలకు వెళుతున్నారు. కోతకు గురైన ప్రతిసారి నాపరాతి వ్యర్థాలను పోస్తున్నామని, అయినా ప్రయోజనం లేదని సర్పంచి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

- న్యూస్‌టుడే, యాలాల


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని