విద్యుత్తు బకాయిల నకిలీ సందేశాలు నమ్మొద్దు
eenadu telugu news
Published : 24/09/2021 01:15 IST

విద్యుత్తు బకాయిల నకిలీ సందేశాలు నమ్మొద్దు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘‘మీరు విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవడంతో, రాత్రి 10.30 గంటల తర్వాత సరఫరా నిలిపివేస్తాం.. నిలిపివేయకుండా ఉండేందుకు బిల్లులు చెల్లింపునకు 9692848762కు కాల్‌ చేయాలంటూ’’ వచ్చే నకిలీ సందేశాలను నమ్మొద్దని టీఎస్‌ఎస్‌పీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఇలా బ్యాంకు ఖాతాలు, డెబిట్‌ కార్డుల వివరాలు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ వెబ్‌సైట్‌ www.tssouthernpower.com, మొబైల్‌ యాప్‌ల్లో బకాయిలు సరిచూసుకోవాలన్నారు. రాత్రి పూట ఏ ఇంటికీ సరఫరా నిలిపివేయమని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని