పాదచారి, మూడు కార్లను ఢీకొన్న బస్సు
eenadu telugu news
Published : 24/09/2021 01:15 IST

పాదచారి, మూడు కార్లను ఢీకొన్న బస్సు

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: బ్రేకులు సరిగా లేని ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వెళుతున్న ఓ పాదచారితో పాటు ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొంది. బోయిన్‌పల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ11జెడ్‌ 6797) తాడుబండ్‌ చౌరస్తానుంచి సికింద్రాబాద్‌ వైపు వెళుతోంది. అన్నానగర్‌ చెక్‌పోస్టు చౌరస్తా సమీపంలోకి చేరగానే బ్రేకులు సరిగా పనిచేయక పోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే నడిచి వెళుతున్న మల్లేశ్‌, పక్కనే షోరూం వద్ద పార్కు చేసిఉన్న మూడు కార్లను ఢీకొంది. ఈ ఘటనలో మల్లేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఇక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని