ఎట్టకేలకు దొంగలు దొరికారు!
eenadu telugu news
Published : 24/09/2021 01:15 IST

ఎట్టకేలకు దొంగలు దొరికారు!

ఈనాడు, హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన కొందర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. టెలికాంనగర్‌లో నివాసముండే వ్యాపారవేత్త తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఈ నెల 19న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు. 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదును దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నాలుగు నెలల కిందట ఇంట్లో పనికి కుదిరిన నేపాలీ దంపతులు లక్ష్మణ్‌(34), పవిత్ర(30)పైనే అనుమానంగా ఉందని స్పష్టం చేశాడు. సైబరాబాద్‌ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీఫుటేజీ ఆధారంగా చోరీ చేసిన తర్వాత పటాన్‌చెరులో నిందితులు సంచరించినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి ఏయే ప్రాంతాల మీదుగా నేపాల్‌కు వెళ్లేందుకు అవకాశముందో కసరత్తు చేశారు. ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకుని మహారాష్ట్ర షోలాపూర్‌ వరకు వెళ్లినట్లు నిర్థారించుకున్నారు. నేపాల్‌ సరిహద్దు రాష్ట్రాల పోలీసులకు నిందితుల ఫొటోలను పంపించి అప్రమత్తం చేశారు. నేపాల్‌ సరిహద్దులకు చేరుకోక ముందే అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని