ప్రగతి ప్రదాతకు పాలతో అభిషేకం
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

ప్రగతి ప్రదాతకు పాలతో అభిషేకం

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి రూ.5వేల కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు గ్రేటర్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంపై నగరవాసులంతా ఆనందంగా ఉన్నారన్నారు. రానున్న 15 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మరో రూ.3866 కోట్లు మంజూరు చేయడంతో పాటు శివారు ప్రాంతాలకూ తాగునీరు అందించేందుకు రూ.1200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని