పూర్తి స్థాయిలో పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు
eenadu telugu news
Updated : 24/09/2021 05:11 IST

పూర్తి స్థాయిలో పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు 100 శాతం అపాయింట్‌మెంట్లు ఇస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాలు, పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్లను కుదించామని, ప్రసుత్తం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రంలోని విచారణ కౌంటర్‌ కూడా పనిదినాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుందని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని