కంటోన్మెంట్‌ విలీనమైతే 15 వేల ఇళ్ల నిర్మాణం
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

కంటోన్మెంట్‌ విలీనమైతే 15 వేల ఇళ్ల నిర్మాణం

ఇళ్ల సముదాయాలను ప్రారంభిస్తున్న మంత్రులు మల్లారెడ్డి, తలసాని, మహమూద్‌ అలీ

రసూల్‌పురా, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ ప్రాంతం జీహెచ్‌ఎంసీలో విలీనమైతే ఈ ప్రాంతంలో 15వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రసూల్‌పురాలోని సిల్వర్‌ కంపెనీ బస్తీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 168 రెండు పడక గదుల ఇళ్లను గురువారం లబ్ధిదారులకు కేటాయించారు. రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలసి తలసాని ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ ఛైర్మన్‌ టీఎన్‌.శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో వసంత, ఎమ్మార్వో బాలశంకర్‌, హౌసింగ్‌ అధికారులు కిషన్‌, వెంకట్రావ్‌రెడ్డి, గంగాధర్‌, నేతలు రాజశేఖర్‌రెడ్డి, సాదా కేశవరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పాండుయాదవ్‌ పాల్గొన్నారు.

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రణాళికలు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, సనత్‌నగర్‌: నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ తదితర ఉన్నతాధికారులతో గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు. సీసీఎల్‌ఏ సహాయ కార్యదర్శి కిషన్‌రావు, మున్సిపల్‌ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, అదనపు కమిషనర్‌ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ రీజనల్‌ సంయుక్త కమిషనర్‌ రామకృష్ణ, ఆర్డీవోలు వసంత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని