1 నుంచి ‘ట్రెడా’ స్థిరాస్తి ప్రదర్శన
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

1 నుంచి ‘ట్రెడా’ స్థిరాస్తి ప్రదర్శన

మాట్లాడుతున్న ట్రెడా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు

బంజారాహిల్స్‌ న్యూస్‌టుడే: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) ఆధ్వర్యంలో అక్టోబరు 1, 2, 3 తేదీల్లో హైటెక్స్‌లో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహించనున్నట్లు ట్రెడా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు తెలిపారు. బంజారాహిల్స్‌లోని హోటల్‌ హ్యత్‌ప్లేస్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రెడా సెక్రటరీ జనరల్‌ సునీల్‌ చంద్రారెడ్డి, కోశాధికారి శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌ సాయితో కలిసి ఆయన మాట్లాడారు. 110 మంది డెవలపర్లు 186 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారని, 800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన చౌకైన ఇళ్ల దగ్గర నుంచి రూ.10కోట్లు విలువ చేసే ప్రాపర్టీలను ప్రదర్శిస్తామన్నారు.నగరం పశ్చిమ వైపునే కాకుండా తూర్పు వైపు సైతం వాణిజ్య సముదాయాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని