‘27న భారత్‌ బంద్‌ జయప్రదం చేయండి’
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

‘27న భారత్‌ బంద్‌ జయప్రదం చేయండి’

రాంనగర్‌, న్యూస్‌టుడే: రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, 2020 విద్యుత్తు సవరణ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్‌టీయూ మోటర్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌ పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 27న ‘భారత్‌ బంద్‌’ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, తెలంగాణ ఆటో సంఘాల ఐకాస, తెలంగాణ టాక్సీఅండ్‌డ్రైవర్స్‌ ఐకాస, తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఆటో ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం గోల్కొండ చౌరస్తాలోని సీఐటీయూ నగర కార్యాలయంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కె.అజయ్‌బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తెలంగాణ టాక్సీ డ్రైవర్ల ఐకాస కో-కన్వీనర్‌ సతీశ్‌, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశ్‌, ఆటో సంఘాల ఐకాస కో-కన్వీనర్‌ అమనుల్లాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని