చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జుడిత్‌ రేవిన్‌ గురువారం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ ఆమెకు ఆలయ విశిష్ఠతను, వీసా భక్తులపై స్వామివారి ఆశీర్వాదం గురించి వివరించారు. స్వామివారి పూలమాల, వాక్‌ పుస్తకాన్ని అందజేశారు. స్వామివారి కృపతో కొవిడ్‌-19 అంతం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ ప్రాంగణం శివాలయంలోని సుందరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బాలాజీ గోశాలలో కాసేపున్నారు. ఇన్‌స్పెక్టర్‌ బి.రాజు ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని