భాగ్యనగర విద్యార్థి.. భారత వాయుసేనాధిపతి
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

భాగ్యనగర విద్యార్థి.. భారత వాయుసేనాధిపతి

చదువుకుంటున్నపుడు వివొేక్‌ చౌదరి (వృత్తంలో)

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భారత వాయుసేనకు కొత్త అధిపతిగా బాధ్యతలు అందుకోనున్న వివేక్‌ ఆర్‌ చౌదరికి 42 ఏళ్లుగా హైదరాబాద్‌తో సంబంధముంది. ఆయన బీహెచ్‌ఈఎల్‌ పాఠశాల పూర్వ విద్యార్థి. చౌదరి తండ్రి ఆర్‌జీ చౌదరి భెల్‌ శిక్షణ పాఠశాలలో సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, తల్లి సుహాన్‌చౌదరి హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తించారు. దీంతో ఆయన విద్యాభ్యాసం ఇక్కడే కొనసాగింది. 1982లో చౌదరి వాయుసేనలో చేరారు. ప్రస్తుతం ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌గా కొనసాగుతున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చౌదరి ఇద్దరు ఒకే తరగతిలో చదువుకున్నారు. మిగ్‌-21, 23, 29, సు-30, ఎంకేఐ ఫైటర్‌ జెట్లు నడిపారు. ప్రభుత్వం చౌదరిని పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, వాయుసేన పతకాలతో సన్మానించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని