లంచం తీసుకుంటూ దొరికిన గ్రేటర్‌ ఉద్యోగి
eenadu telugu news
Updated : 24/09/2021 02:45 IST

లంచం తీసుకుంటూ దొరికిన గ్రేటర్‌ ఉద్యోగి

సయ్యద్‌ చాంద్‌పాషా, షణ్ముఖరావు

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: ఆస్తి మార్పిడికి లంచం తీసుకుంటూ కూకట్‌పల్లి సర్కిల్‌ రెవెన్యూ విభాగంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఆస్‌బెస్టాస్‌ కాలనీకి చెందిన నాగరాజు ఆస్తి మార్పిడి కోసం రెండు మాసాల కిందట కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఎంతకీ పని చేయకపోగా రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట సయ్యద్‌ చాంద్‌పాషా రూ.8 వేలు డిమాండ్‌ చేశాడు. ట్రేడ్‌ లైసెన్స్‌ పేరు మార్పు, చిరునామా మార్పు కోసం నాగరాజు ఇదే కార్యాలయం పారిశుద్ధ్య విభాగంలో దరఖాస్తు చేశాడు. అక్కడ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి షన్ముఖరావు రూ.2,500 డిమాండ్‌ చేశాడు. సయ్యద్‌ చాంద్‌పాషాకు నాగరాజు రూ.8 వేలు, షణ్ముఖరావుకు ఫిర్యాదుదారు తమ్ముడు శివరాజ్‌ రూ.2,500 ఇస్తుండగా గురువారం ఏసీబీ డీఎస్‌పీలు సయ్యద్‌ ఫయాజ్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో రెండు వేర్వేరు బృందాలుగా వచ్చిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని