నిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

నిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స

రోగితో కార్డియాలజీ ప్రొఫెసర్‌ సాయిసతీష్‌, వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు గుండె సంబంధిత వ్యాధికి ఎలాంటి కోత లేకుండా 3 గంటల్లోనే శస్త్రచికిత్స పూర్తి చేసి ఓ మహిళకు పునర్జన్మ ప్రసాదించారు. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన బాలమణి(56) వ్యవసాయ కూలీ. ఆమె గుండె అసాధారణంగా నిమిషానికి 250 సార్లు కొట్టుకోవడంతో పాటు రక్తం సరఫరా అయ్యే కవాటం మూతపడింది. నిమ్స్‌లో పరీక్షించిన కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌ సాయిసతీష్‌ తన బృందంతో కలిసి చికిత్స చేశారు. మూసుకుపోయిన కవాటాన్ని తెరిచేందుకు వాల్వోటోమీ ప్రక్రియ ఉపయోగించారు. త్రిడీ మ్యాప్‌ సాయంతో రేడియో ఫ్రిక్వెన్సీ (ఆర్‌ఎప్‌ఐడీ) ద్వారా గుండె కొట్టుకునే వేగాన్ని అదుపులోకి తెచ్చారు. వైద్యులు హేమంత్‌, అర్చన, కపిల్‌, షాహు, మణికృష్ణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని