ఉస్మాన్‌సాగర్‌ 2 గేట్లు ఎత్తివేత
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

ఉస్మాన్‌సాగర్‌ 2 గేట్లు ఎత్తివేత

నార్సింగి న్యూస్‌టుడే: ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట) జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరగడంతో గురువారం సాయంత్రం రెండు గేట్లను ఎత్తినట్లు జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జలాశయంలోకి ప్రస్తుతం 200 క్యూసెక్కుల వరద వస్తుండగా అధికారులు 240 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. అదే విధంగా హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి 350క్యూసెక్కుల నీరు వస్తుండగా ఒక గేటు ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

నగరాన్ని వీడని వాన

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని నగరంలో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీకాలనీలో గరిష్ఠంగా 3.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. హఫీజ్‌పేటలో 2.88, ఉప్పల్‌ మారుతినగర్‌లో 2.68, చందానగర్‌లో 2.28, ఆర్‌.సి.పురంలో 2.08, ఎంఎంటీఎస్‌ లింగంపల్లిలో 1.95, హైదర్‌నగర్‌లో 1.9, బాలాజీనగర్‌లో 1.73 సెం.మీ వర్షం కురిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని