శివారులో ట్రాఫిక్‌ చిక్కులు ఉండవిక!
eenadu telugu news
Updated : 24/09/2021 10:56 IST

శివారులో ట్రాఫిక్‌ చిక్కులు ఉండవిక!

ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం

రూ.492 కోట్లతో అభివృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, కుత్బుల్లాపూర్‌: బోయిన్‌పల్లి చౌరస్తా నుంచి కొంపల్లి రైల్వే ట్రాక్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. పది కిలోమీటర్ల దూరంలో మూడు ఫ్లైఓవర్లు, సర్వీసు రోడ్లతో నిర్మాణం చేపట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదం తెలిపింది. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఎస్సార్డీపీ) కింద రూ.492 కోట్లతో నిధులతో ఆయా పనులు చేపట్టనున్నారు. సుచిత్ర కూడలి, జీడిమెట్ల జంక్షన్‌, కొంపల్లి చౌరస్తాల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు.

నగరం నుంచి కీలకమైన జాతీయ రహదారి 44 మీదుగా నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఉన్న కూడళ్ల వద్ద తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ రద్దీని దాటేందుకు వాహనదారులు గంటల తరబడి సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. నగరవాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని సమయానికి గమ్యస్థానాలకు చేరలేక అవస్థలు పడుతున్నారు. ఈ వివరాలను కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ తెలియజేశారు.

కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు

* సుచిత్ర-డైరీఫామ్‌ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్‌..నిర్మాణం పూర్తయితే.. అల్వాల్‌తో పాటు రాజీవ్‌ రహదారి, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

* కొంపల్లి-దూలపల్లి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయితే.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు వెళ్లే రోడ్డు, బొల్లారం నుంచి రాజీవ్‌ రహదారి కరీంనగర్‌కు వెళ్లేందుకు సులభం అవుతుంది.

* జీడిమెట్ల-సినీ ప్లానెట్‌ వద్ద .. ఇక్కడి నుంచి జీడిమెట్ల గ్రామం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీకి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.

● మొత్తం రోడ్డు నిర్మాణం: 3.795 కి.మీ.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని