Bandi Sanjay: రైతు ఆత్మహత్యలన్నీ తెరాస ప్రభుత్వ హత్యలే: బండి సంజయ్‌
eenadu telugu news
Updated : 24/09/2021 10:25 IST

Bandi Sanjay: రైతు ఆత్మహత్యలన్నీ తెరాస ప్రభుత్వ హత్యలే: బండి సంజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ తెరాస ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఆరోపించారు. 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.

వరి పంట వేయొద్దంటూ ఇచ్చిన ప్రకటనను సీఎం ఉపసంహరించుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము రూ.413.50కోట్లు చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి దళారీల నుంచి రైతులను రక్షించాలన్నారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను వెంటనే మంజూరు చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు అండగా భాజపా పోరాటం చేస్తుందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని