TS News: వ్యక్తిగత ప్రచారానికి ఆరాటపడితే కాంగ్రెస్‌లో కుదరదు: జగ్గారెడ్డి
eenadu telugu news
Published : 24/09/2021 11:00 IST

TS News: వ్యక్తిగత ప్రచారానికి ఆరాటపడితే కాంగ్రెస్‌లో కుదరదు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌ జహీరాబాద్‌ పర్యటనకు వస్తున్నట్లు తనకు సమాచారం లేదని.. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్‌ పార్టీలో కుదరదని వ్యాఖ్యానించారు. కనీసం మాజీ మంత్రి గీతారెడ్డికి కూడా సమాచారం లేదన్నారు. సంగారెడ్డి వస్తే తనకు సమాచారం తెలియలేదని చెప్పారు. విబేధాలు ఉన్నాయని చెప్పేందుకే సమాచారం ఇవ్వట్లేదా? అని నిలదీశారు. సీఎల్పీ అంతర్గత సమావేశంలో ముఖ్యనేతల వద్ద జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని