సుమధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

సుమధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: పాటకు పరిమళాలద్దిన సుమధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని డా.కె.వి.రమణాచారి కొనియాడారు. వంశీ-ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా, తెలుగు కళా సమితి (ఖతార్‌) ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై 24 గంటల ‘ఎస్పీ బాలు స్వర రాగ మహాయాగం’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 25 దేశాల గాయనీ గాయకులు బాలు పాడిన పాటలు పాడారు. కార్యక్రమం నిర్వాహకులు వంశీ రామరాజు, ఖతార్‌ తెలుగు సంస్థ అధ్యక్షులు తాతాజీ ఉసిరికల, కన్వీనర్‌ పద్మజ మాట్లాడుతూ.. ఏదైనా విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఎస్పీ బాలు పేరిట బంగారు పతకం అందజేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సినీ నటులు తనికెళ్ల భరణి, సినీ కవి భువనచంద్ర, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌, దర్శకుడు రేలంగి నరసింహారావు, శ్రీదేవి జాగర్లమూడి (న్యూజెర్సీ), శ్రీలత మడతల (న్యూజిలాండ్‌)లతో పాటు వివిధ దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని