పరికరాలకు సుస్తీ.. శస్త్రచికిత్సలకు స్వస్తి
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

పరికరాలకు సుస్తీ.. శస్త్రచికిత్సలకు స్వస్తి

నిమ్స్‌ నుంచి రోగులు ప్రైవేటుకు

ఈనాడు, హైదరాబాద్‌

నిమ్స్‌ ఆసుపత్రిలో రోగుల వ్యాధులను నిర్ధారించి.. శస్త్ర చికిత్సలుచేసేయంత్రాలు పనిచేయకపోవడంతో వైద్యులు సైతం చేతులెత్తేస్తున్నారు.

కోల్‌కతకు చెందిన ఓ వ్యక్తి కాలేయం సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు.. కొన్ని టెస్టులు రాశారు. పరీక్షల కోసం డీఎస్‌ఏ ల్యాబ్‌కు వెళ్తే.. పని చేయడం లేదని, ఇక్కడ పరీక్ష చేయించుకోవాలంటే మూడు నెలలు ఆగాలన్నారు.

పదిహేనేళ్లుగా ఒక్కటే..

వ్యాధి తీవ్రతను తెలిపే డిజిటల్‌ సబ్‌స్ట్రక్షన్‌ యాంజియోగ్రఫీ(డీఎస్‌ఏ)ల్యాబ్‌ సేవలు పదిహేను రోజులుగా నిలిచిపోయాయి. ఈ యంత్రం సాయంతో కోత లేకుండా, కేవలం స్టంట్‌లు వేసి రోగికి వేగంగా వైద్యం అందిస్తారు. రక్తనాళాల బ్లాక్‌లను ఇది గుర్తించి.. రోగికి అందించే చికిత్సపై ఓ స్పష్టత ఇస్తుంది. అన్ని విభాగాలకు కీలకమైన ఈ యంత్రం పనిచేయకపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో రోగులు వెనుతిరుగుతున్నారు. దీనిని 15 ఏళ్ల కిందట కొనుగోలు చేశారని, నిర్వహణ వ్యవధి ముగిసినా నిర్లక్ష్యం వహించారని కొంత మంది వైద్యులు యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొత్త పరికరానికి టెండర్‌ -నిమ్మ సత్యనారాయణ, మెడికల్‌ సూపరింటెండెంట్‌.

డీఎస్‌ఏ ల్యాబ్‌ సేవలు తాత్కాలికంగా కొనసాగుతున్నాయి. అత్యవసరమైన రోగుల కోసమే వినియోగిస్తున్నాము. కొత్త యంత్రం అవసరముంది. త్వరలోనే టెండర్లు వేసి.. సత్వరమే కొత్త యంత్రం వచ్చేలా చర్యలు తీసుకుంటాము.

ఈ విభాగాల్లో కొరత

ఎండోస్కోపి యంత్రం మెడికల్‌, సర్జికల్‌గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మెడికల్‌ విభాగంలో మాత్రమే అందుబాటులో ఉంది. రోగి శరీరంలోని అవయవాల్లో మార్పులు గుర్తించడంలో ఉపయోగించే సీ-ఆమ్‌ యంత్రం సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగాల్లో లేదు. అవసరమైతే.. ఇతర విభాగాలకు వెళ్లి తీసుకోవాల్సిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని