మ్యూజియాన్ని సందర్శించిన గవర్నర్‌ తమిళిసై
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

మ్యూజియాన్ని సందర్శించిన గవర్నర్‌ తమిళిసై


పాలరాతి కళాఖండాల గ్యాలరీ వద్ద గవర్నర్‌ తమిళిసై, మేయర్‌ విజయలక్ష్మి ఇతర సభ్యులు

చార్మినార్‌, న్యూస్‌టుడే: సాలార్‌జంగ్‌ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్‌, మ్యూజియం బోర్డు ఛైర్మన్‌ తమిళిసై సౌందరాజన్‌ శుక్రవారం సందర్శించారు. నగర మేయర్‌, బోర్డు సభ్యులు గద్వాల విజయలక్ష్మితో కలిసి మ్యూజియంలోని వివిధ గ్యాలరీల్లో కళాఖండాలను వీక్షించారు. గ్యాలరీల అభివృద్ధితో పాటు కళాఖండాలపై అవగాహన కల్పించే ఇన్‌ట్రడక్షన్‌ గ్యాలరీని కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు సమీక్షలో గవర్నర్‌ పేర్కొన్నారు. సమావేశంలో మ్యూజియం బోర్డు ఇతర సభ్యులు నవాబ్‌ ఎతిరామ్‌అలీఖాన్‌, ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌, అకౌంటెంట్‌ జనరల్‌ అన్నీన్‌ద్రాదాస్‌, మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని