తెలుగు భాషను పరిరక్షించుకుందాం
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

తెలుగు భాషను పరిరక్షించుకుందాం


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిరంజర్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌ తదితరులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు ప్రపంచ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ కమిషన్‌ కార్యాలయంలో ‘శతక షోడశి’ పుస్తకాన్ని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌తో కలిసి ఆవిష్కరించారు. వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడుతున్న 12వ భాషగా తెలుగుకు గుర్తింపు ఉందన్నారు. కార్యక్రమానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం అధ్యక్షత వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని