ఆక్సిజన్‌ యూనిట్ల తయారీలో భెల్‌
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

ఆక్సిజన్‌ యూనిట్ల తయారీలో భెల్‌

భెల్‌ (శేరిలింగంపల్లి) న్యూస్‌టుడే: కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు ఎంత భారీ స్థాయిలో అవసరమయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో బీహెచ్‌ఈఎల్‌ హైదరాబాద్‌ యూనిట్‌కు మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల తయారీ రంగంలోకి అడుగిడింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా చాలా సంస్థల నుంచి విశేషంగా ఆర్డర్లు లభిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నుంచి 500 ఎల్‌పీఎం ఆర్డర్‌ వచ్చింది. మహారాష్ట్ర రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎస్‌డీఎంఏ నుంచి పది 1000 ఎల్‌పీఎం యూనిట్ల తయారీ కోసం ఆర్టర్‌ లభించింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని బీహెచ్‌ఈఎల్‌ హెచ్‌పీబీపీ తిరుచ్చి యూనిట్‌ నుంచి కూడా ఆర్డర్‌ వచ్చిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నగరంలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి ఓ యూనిట్‌ని తయారు చేసి ఇచ్చామని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని