కొవిడ్‌తో వీఆర్‌ఓ మృతి
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

కొవిడ్‌తో వీఆర్‌ఓ మృతి

మాదన్నపేట, నాంపల్లి, న్యూస్‌టుడే: చార్మినార్‌ మండల కార్యాలయం వీఆర్‌ఓ పార్థసారథి(48) కొవిడ్‌ బారినపడి శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తహసీల్దార్‌ మల్లేష్‌కుమార్‌ తెలిపారు. వారం రోజులుగా నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా మహమ్మారి నుంచి బయటపడలేక పోయారని చెప్పారు. మీర్‌పేట పరిధి జిల్లేలగూడకు చెందిన పార్థసారథి వీఆర్‌ఓగా నాంపల్లి, ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని చేశారు. 2019లో చార్మినార్‌కు వచ్చారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో పార్థసారథి చిత్రపటానికి కలెక్టర్‌ శర్మన్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శి పి.నరేష్‌, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షులు అజయ్‌ నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని