ఉపకారాల పేరిట అపకారం
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

ఉపకారాల పేరిట అపకారం

కాటేదాన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు(స్కాలర్‌షిప్పుల) ఇప్పిస్తామంటూ రూ.కోటి దండుకున్న మాయగాళ్లను రాజేంద్రనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ కనకయ్య కథనం ప్రకారం...అత్తాపూర్‌ లక్ష్మీనగర్‌ కాలనీలోని ఓ భవనంలో గ్రీన్‌ లీఫ్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సోషియల్‌ కాజ్‌ పేరుతో ఈ ఏడాది జూన్‌లో కార్యాలయం ప్రారంభించారు. 10, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వ ఉపకార వేతనాలు వచ్చేలా చేస్తామని తల్లిదండ్రులను నమ్మించారు. అర్హత పత్రాలతో పాటు వివిధ రుసుములు పేరుతో రూ.300 నుంచి రూ.3వేల వరకూ.. 500 మంది నుంచి వసూలు చేశారు. నెలరోజుల్లోపు స్కాలర్‌షిప్పులు వస్తాయని నమ్మించారు. బాధితుల్లో పాతబస్తీ, ముషీరాబాద్‌, నాంపల్లి, మలక్‌పేట తదితర ప్రాంతాలవారు ఉన్నారు. ఎంతకీ ఉపకార వేతనాలు రాకపోవడంతో కొందరు విద్యార్థులు సంస్థ పనితీరును పరిశీలించారు. అనుమానం కలిగి శుక్రవారం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్వేత ఆధ్వర్యంలో బృందం సంస్థ కార్యాలయంలో సోదాలు చేసి 1,500 అర్జీలు స్వాధీనం చేసుకుంది. పలువురు బాధితులు అక్కడకు చేరుకుని లబోదిబోమన్నారు. సంస్థ సిబ్బంది మెహదీపట్నంకు చెందిన మొహ్మద్‌ మాజిద్‌, శంకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మాజిద్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని