వాణిజ్య ఎగుమతిదారులకు ఆర్థిక భరోసా
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

వాణిజ్య ఎగుమతిదారులకు ఆర్థిక భరోసా

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపారాలు మరింత వృద్ధి సాధించేందుకు వాణిజ్య ఎగుమతి దారులకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయంలో జిల్లా ఎగుమతి దారుల ‘వాణిజ్య ఉత్సవ్‌’ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జిల్లాలో పూలు, పండ్లు, కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉందని.. వాటితో పాటు ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు బ్యాంకులు కూడా అతి తక్కువ వడ్డికే రుణాలు అందిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికుల్ని ప్రోత్సహించేందుకు టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 13 రంగాలకు చెందిన 4,419 పరిశ్రమలు ఉన్నాయన్నారు. కొత్త పరిశ్రమలకు అనుమతులు, పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం దేబాసిస్‌ మిశ్రా, జనరల్‌ మేనేజర్‌ ప్రమోద్‌ కుమార్‌, ఉద్యానశాఖ అధికారి సునందరాణి, వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని