సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

సంక్షిప్త వార్తలు

‘ఆకాశ్‌’ జాతీయ ఉపకార వేతన పరీక్షలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: డిసెంబరు 4వ తేదీ నుంచి ఆకాశ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జాతీయ ఉపకార వేతనం-2021 అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినీ విద్యార్థులు సమీపంలోని ఆకాశ్‌ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు 2010 నుంచి ఆకాశ్‌ సంస్థ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇప్పటి వరకూ 23 లక్షల మంది విద్యార్థులు ఈ ఉపకార వేతనానికి అర్హత సాధించినట్లు వివరించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉపకార వేతనంతో పాటు వివిధ గ్రేడుల్లో ఐదుగురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి నాసా కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు.


నర్సింగ్‌ కోర్సులో ఉచిత శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నర్సింగ్‌ కోర్సులో మూడు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. శుక్రవారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18-28 ఏళ్ల మధ్య వయసు ఉండి ఎస్సెస్సీ ఉత్తీర్ణులు, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులైన యువతులకు శిక్షణ ఉంటుందన్నారు. పేర్ల నమోదుకు ఫోన్‌ నంబర్లు: 7032854540, 8019050334 సంప్రదించాలని సూచించారు.


వాతావరణ మార్పులపై అధ్యయనానికి ఇక్రిశాట్‌ ఒప్పందం

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: దేశంలో వస్తున్న వాతావరణ మార్పులపై అధ్యయనం చేయడానికి ఇక్రిశాట్‌తో యూఎన్‌ వారి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) భారత్‌ విభాగం దిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇక్రిశాట్‌ డీజీ జాకిలిన్‌ హ్యూస్‌, డబ్ల్యూఎఫ్‌ఫీ డైరెక్టర్‌ బిషా పారాజులి సంతకాలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని