మౌలాలిలో ఆర్‌పీఎఫ్‌ కవాతు
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

మౌలాలిలో ఆర్‌పీఎఫ్‌ కవాతు


పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న రైల్వే కమాండింగ్‌ ఆఫీసర్‌ కొండయ్య

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: తూర్పు ఆనంద్‌బాగ్‌ డివిజన్‌ పరిధిలోని మౌలాలి ఆర్‌పీఎఫ్‌ వ్యవస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మైదానంలో కనుల పండువగా కవాతును నిర్వహించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేసే ఆర్‌పీఎఫ్‌లో పనిచేసే వారు తమ సంస్థ రైజింగ్‌ డేను పురస్కరించుకొని కవాతు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆర్‌పీఎప్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కె.ఎం. కొండయ్య గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, హరితహారం, సాంసృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు కమాండింగ్‌ ఆఫీసర్‌ కొండయ్య బహుమతులు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని