అక్టోబరు 2 నుంచి న్యాయ అవగాహన సదస్సులు
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

అక్టోబరు 2 నుంచి న్యాయ అవగాహన సదస్సులు


రాధిక జైస్వాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 14 వరకు న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్‌ తెలిపారు. శుక్రవారం నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 10 బృందాలను నియమించగా ఇందులో ప్యానెల్‌ న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ విద్యార్థులు, ఆశా వర్కర్లు ఉన్నారు. మొత్తం 350 కార్యక్రమాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని