కరోనా చికిత్సకు స్టెరాయిడ్లతో దుష్ప్రభావాలు
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

కరోనా చికిత్సకు స్టెరాయిడ్లతో దుష్ప్రభావాలు

 

డాక్టర్‌ సాయిలక్ష్మణ్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఏడేళ్ల కిందట మోకాళ్ల మార్పిడి చేసుకున్న ఓ మహిళ గత ఏడాది ఆగస్టులో కరోనా బారినపడ్డారు. నెల తరువాత ఆమెకు మోకాళ్లలో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర ఇబ్బంది తప్పలేదు. ఆమెకు కొండాపూర్‌ కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందించి సమస్యను పరిష్కరించారు. రెండు మోకాళ్లలో ఒకే సారి ఇలా ఇన్ఫెక్షన్‌ రావడం చాలా అరుదని, కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులు ఇలాంటి దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని కిమ్స్‌ ఆసుపత్రి చీఫ్‌ కన్సెల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ సాయిలక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఒంగోలుకు చెందిన నాగేశ్వరమ్మ(60)కు ఏడేళ్ల కిందట రెండు మెకాళ్ల మార్పిడి చికిత్స చేశారు. 2020 ఆగస్టులో కొవిడ్‌ సోకగా.. కార్టికో స్టెరాయిడ్లు, యాంటీ వైరల్‌ మందులు, ఇతర ఔషధాలతో కోలుకున్నారు. మరో నెల తరువాత ఆమెకు రెండు మోకాళ్లు వాచి బాగా నొప్పి మొదలైంది. రెండు మోకాళ్లలో ద్రవాలను తీసి కల్చర్‌ పరీక్ష చేయగా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు ఖారారైంది. కిమ్స్‌ వైద్యులు ఆమె మోకాళ్లలోని ఇంప్లాంట్లను తీసి యాంటీబయోటిక్‌ సిమెంట్‌ స్పేసర్లను వేశారు. ఆరు వారాల తరువాత స్పేసర్లను తీసి రెండు వైపులా మోకాళ్లను మార్పిడి శస్త్రచికిత్స చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని