బహుజనులకు సమాన అవకాశాలు కల్పించాలి
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

బహుజనులకు సమాన అవకాశాలు కల్పించాలి


గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న జయంతి, చంటి, జనార్దన్‌, గుజ్జ సత్యం, ఆర్‌.కృష్ణయ్య,

దాసు సురేశ్‌, గుజ్జ కృష్ణ, కిష్టుడు, స్వప్న తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: బహుజనులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తే సంపూర్ణ తెలంగాణ ఆవిష్కృతమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. సంపూర్ణ తెలంగాణ లక్ష్య సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఈ నెల 27న నెక్లెస్‌ రోడ్డు జలదృశ్యంలో రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంస్థలు, ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలతో కలిసి నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని హోటల్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతికి సంబంధించిన గోడపత్రికను జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ దాసు సురేశ్‌, కోఛైర్మన్‌ గుజ్జ సత్యం, సలహాదారు గుజ్జ కృష్ణతో కలిసి ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కోల జనార్దన్‌, ఉదయ్‌ నేత, జోషి కిష్టుడు, జయంతి, స్వప్న, చంటి, కిశోర్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని