యువతలో ఆకస్మిక గుండె వైఫల్యం
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

యువతలో ఆకస్మిక గుండె వైఫల్యం


మాట్లాడుతున్న డాక్టర్‌ అనిల్‌ కృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆకస్మిక గుండె వైఫల్యం కేసులు యువతలో పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హృద్రోగంతో ఆసుపత్రులకు వస్తున్న వారిలో 30 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారని చెబుతున్నారు. రక్త నాళాలు మూసుకు పోవడం, పంపింగ్‌లో వైఫల్యం, జన్యు సంబంధ సమస్యల కారణంగా వీరు హృద్రోగం బారిన పడుతున్నారన్నారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నర కాలంగా ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కూడా రక్తపోటు, మధుమేహం, అధిక బరువు పెరిగి చివరికి కార్డియాక్‌ సమస్యలకు దారి తీస్తున్నాయన్నారు. తీవ్రమైన గుండెపోటుతో వచ్చే రోగులకు చికిత్స నిమిత్తం మాదాపూర్‌లోని మెడి కవర్‌ ఆసుపత్రిలో కొత్తగా లెవల్‌-1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌ను శుక్రవారం ఆసుపత్రి ఛైర్మన్‌, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అనిల్‌కృష్ణ, డైరెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌ అనిల్‌ కృష్ణ మాట్లాడుతూ దాదాపు సగానికి పైగా కార్డియో వాస్క్యులర్‌ డీసీజ్‌(సీవీడీ) మరణాలు అకస్మాత్తుగానే జరుగుతున్నాయన్నారు. తీవ్రమైన గుండెపోటు సంభవించిన సమయంలో తక్షణ వైద్య సహాయం అందితే 70 శాతం మందిని కాపాడవచ్చన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ లెవల్‌-1 కేంద్రంలో 24 గంటలూ ప్రాథమిక పీసీఐ సదుపాయాలు, ఇంపెల్లా, మెకానికల్‌ సర్క్యులేటరీ సపోర్ట్‌ ఉపకరణాలు, అనుభవజ్ఞులైన అత్యవసర చికిత్స విభాగం అందుబాటులో ఉంటాయన్నారు. డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని