‘వెంకటేశం కుటుంబాన్ని ఆదుకుంటాం’
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

‘వెంకటేశం కుటుంబాన్ని ఆదుకుంటాం’


బాధితులతో మాట్లాడుతున్న రాజమౌళి

గజ్వేల్‌, న్యూస్‌టుడే: బల్దియా పరిధి 15వ వార్డు ప్రజ్ఞాపూర్‌లో గురువారం గుండెపోటుతో మృతి చెందిన వడ్డెపల్లి వెంకటేశం కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా ఛైర్మన్‌ ఎన్సీ రాజమౌళి హామీ ఇచ్చారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పడకగదుల ఇల్లు వచ్చేలా చూస్తామన్నారు. కుటుంబీకులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అద్దె ఇంటి యజమాని, వెంకటేశానికి పాఠశాల స్నేహితుడు చేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన ఉదారత చాటుకున్నారు. ఇంటిని ఉపయోగించుకోవచ్చని కుటుంబాన్ని అనుమతించారు. ఆటో కార్మిక సంఘం సభ్యులు, ఇతరులు కలసి బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేల విరాళం మొత్తాన్ని అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని