హోరాహోరీగా క్రికెట్‌ పోటీలు
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

హోరాహోరీగా క్రికెట్‌ పోటీలు

విజేతగా రేవంత్‌రెడ్డి జట్టు


జట్టు సభ్యులతో కలిసి వస్తున్న అజహరుద్దీన్‌

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ కప్‌’ క్రికెట్‌ పోటీలు రాత్రి చీకటి పడేవరకు హోరాహోరీగా సాగాయి. స్థానిక బాగారెడ్డి మైదానంలో టీపీసీసీ అధ్యక్షుడు సారథ్యంలో ఏర్పాటైన ‘రేవంత్‌రెడ్డి ఎలవన్‌’, అజారుద్దీన్‌ సారథ్యంలోని ‘అజహరుద్దీన్‌ ఎలవన్‌’ జట్ల మధ్య సాగిన పోటీలో రేవంత్‌రెడ్డి జట్టు విజయం సాధించింది. 12 ఓవర్ల ఆటలో ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న అజారుద్దీన్‌ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రేవంత్‌రెడ్డి జట్టు ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగా, 10 ఓవర్లో చివరి బంతికి ఆరు పరుగులు తీసిన రేవంత్‌రెడ్డి తన జట్టుకు విజయం వరించేలా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, అజహరుద్దీన్‌, మహేశ్‌కుమార్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరరాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ సురేష్‌కుమార్‌ షెట్కార్‌, జహీరాబాద్‌ పార్లమెంటు ఇన్‌ఛార్జి మదన్‌మోహన్‌రావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ జైపాల్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు నరోత్తం, పలు మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, యువకులు తరలిరావటంతో బాగారెడ్డి మైదానం కిటకిటలాడింది.


రేవంత్‌రెడ్డి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని