చందన వదనుడికి చతుర్థి శోభ
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

చందన వదనుడికి చతుర్థి శోభ


వినాయకుడు

న్యాల్‌కల్‌ న్యూస్‌టుడే: భక్తుల కోర్కెలు తీరుస్తూ.. సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ స్వయంభూ శ్రీసిద్ధివినాయకుడి క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. సంకట చతుర్థి పర్వదినం కావడంతో చందన వదనుడిని దర్శించుకోవడానికి స్థానిక భక్తులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి పౌర్ణమి తరువాత వచ్చే నాలుగో రోజున సంకట చతుర్థిగా సిద్ధి వినాయకుడిని భక్తులు కొలుస్తారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తమండలి, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, ఆందోల్‌ తదితరాలతోపాటు కర్ణాటకలోని బీదర్‌, హుమ్నాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు సిద్ధివినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా శీఘ్ర, లఘు, ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేశారు.


దైవదర్శనానికి బారులు తీరిన భక్తులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని