TS News: రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు
eenadu telugu news
Published : 25/09/2021 16:37 IST

TS News: రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు

హైదరాబాద్: జనగామ జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని పొన్నాల లక్ష్మయ్య నివాసంలో వివిధ పార్టీలకు చెందిన 32 మంది నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వచ్చారు. సీపీఎం, టీఆర్‌ఎస్‌, తెదేపా, బీఎస్పీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు పలువురు నేతలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని