తాండూరు వరకు ‘ఎంఎంటీఎస్‌’ నడపాలి
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

తాండూరు వరకు ‘ఎంఎంటీఎస్‌’ నడపాలి

భాజపా జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి

వినతిపత్రం అందజేస్తున్న భాజపా నాయకులు

వికారాబాద్‌టౌన్‌, పరిగి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి తాండూరు వరకు ఎంఎంటీఎస్‌ రైలు నడపాలని భాజపా జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని కాచిగూడలో ఆల్‌ ఇండియా రైల్వేబోర్డు  కృష్ణదాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు, వికారాబాద్‌ నుంచి నిత్యం వేల సంఖ్యలో హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని, ఎంఎంటీఎస్‌ వేయడం ద్వారా ప్రయాణం సులభతరం అవుతుందని తెలిపారు. వికారాబాద్‌ టు పరిగి, మక్తల్‌ వరకు కొత్త రైల్వేలైన్‌ వేయాలన్నారు. ఇదే విషయమై పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌ ఛైర్మన్‌కు విన్నవించారు. 2007లో వికారాబాద్‌ నుంచి మక్తల్‌ వరకు లైన్‌ ఏర్పాటుకు సర్వే జరిగిందని వివరించారు. ఇందుకు రైల్వే బోర్డు  ఛైర్మన్‌ స్పందించి త్వరలో వికారాబాద్‌ను సందర్శించి సాధ్యాసాధ్యాలను పరిశీ లిస్తామని చెప్పారు. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్‌, రమేశ్‌, బస్వలింగం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీలత పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని