గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ

అఖిల పక్ష నాయకుల ఆరోపణ

పరిగి గ్రామీణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘గల్లీలో కుస్తీ..దిల్లీలో దోస్తీ’ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాయని డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య, సీపీఎం, సీపీఐ నాయకులు వెంకటయ్య, పీర్‌ మహ్మద్‌లు అన్నారు. పరిగిలోని మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి నివాసంలో శనివారం నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈనెల 27 తేదీన దేశవ్యాప్తంగా అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు భారత్‌ బంద్‌ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పరశురాంరెడ్డి, కృష్ణ, రామన్న, మోహనాచారి, న్యాయవాది ఆనంద్‌గౌడ్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

తాండూరు: వ్యవసాయానికి వ్యతిరేకంగా తీసుకు వచ్చిన మూడు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. తాండూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్దేముల్‌ జడ్పీటీసీ సభ్యుడు ధారాసింగ్‌, తాండూరు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌ గౌడ్‌, సీపీఐ రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మీ పండిత్‌, తెజస తాండూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి సోమశేఖర్‌, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న హన్మంతు, చంద్రయ్య తదితరులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని