దాడి చేయడం తప్పే: సర్పంచి
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

దాడి చేయడం తప్పే: సర్పంచి

క్షమాపణ చెబుతున్న సర్పంచి జైపాల్‌రెడ్డి (ఎడమ), మధ్యలో బాధితుడు శ్రీనివాస్‌, పక్కన శుభప్రద్‌ పటేల్‌

మర్పల్లి: ‘మా గ్రామానికి చెందిన కొందరు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. ఆ సమయంలో మధ్యలో వచ్చిన శ్రీనివాస్‌పై చేయి చేసుకున్నా. గ్రామ ప్రథమ పౌరుడిగా దాడి చేయడం తప్పేనని సర్పంచి జైపాల్‌రెడ్డి అంగీకరించారు. అనంతరం సర్పంచి బాధితుడి ఇంటికి వెళ్లి మీ కుటుంబానికి వ్యక్తిగతంగా హాని చేయనని హామీ ఇస్తున్నా..అని చేతిలో చేయి వేసి క్షమించాలని కోరారు. మండలంలోని దమస్తాపూర్‌ గ్రామానికి చెందిన పిట్టెల శ్రీనివాస్‌ను మూడు రోజుల కిందట సర్పంచి జైపాల్‌రెడ్డి దాడి చేసి గాయపరిచాడు. దీనికి సంబంధించి శనివారం బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌ గ్రామాన్ని సందర్శించారు. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి కారణాలను అడిగి వివరాలకు సేకరించారు. తమకు ప్రాణ భయం ఉందని న్యాయం చేయాలని బాధితుడు కోరారు. బీసీ కమిషన్‌ సభ్యుడు వచ్చిన విషయం తెలుసుకొని వివిధ గ్రామాల నుంచి కుల సంఘాల ప్రతినిధులు ఈ గ్రామానికి చేరుకున్నారు. అందరి సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచి క్షమాపణ చెప్పారు.కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు నాయబ్‌గౌడ్‌, బీసీ సంఘం నాయకులు దత్తు, మాదిగ జేఏసీ శంకర్‌ తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని