కొరవడిన నిర్వహణ.. ప్రయాణానికి ఆందోళన
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

కొరవడిన నిర్వహణ.. ప్రయాణానికి ఆందోళన

జిల్లాలో ఏళ్ల కిందట నిర్మించిన కల్వర్టుల నిర్వహణ కొరవడి శిథిలమవుతున్నాయి. పెచ్చులూడి రాళ్లు పడిపోతున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణమంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దుస్థితి నవాబుపేట మండలంలో నెలకొంది. చిట్టిగిద్ద, మాదారం, గేటువనంపల్లి, మీనెపల్లికలాన్‌, మాదిరెడ్డిపల్లి, పూలపల్లి (ఆర్‌అండ్‌బీ రోడ్డు) గ్రామాల పరిధిలో  కల్వర్టులు అధ్వానంగా మారాయి. భారీ, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్న సమయంలో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి మరమ్మతు చేపట్టాలని నాలుగేళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం ఉండటం లేదని, ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, నవాబ్‌పేట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని