ఎనిమిదేళ్ల పాపకు ఎన్ని కష్టాలో!
eenadu telugu news
Published : 26/09/2021 08:24 IST

ఎనిమిదేళ్ల పాపకు ఎన్ని కష్టాలో!


బాలికతో మాట్లాడుతున్న సీఐ వేణుగోపాల్‌రెడ్డి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే : ఆ బాలిక వయసు ఎనిమిదేళ్లు. చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోయారు. ఇంతకాలం బంధువుల ఇంటి వద్ద పెరిగింది. ఏమైందో ఏమోగానీ బాలికను ఓ వసతి గృహం ముందు వదిలిపెట్టి వాళ్లు వెళ్లిపోయారు. ఏంచేయాలో తెలియక బాలిక లోపలికి వెళ్లింది. వసతి గృహం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలిక పోలీస్‌స్టేషన్‌ చేరింది. 

పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం ముందు శనివారం 8 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. తన పేరు శ్వేత అని తండ్రిపేరు ప్రభాకర్‌రెడ్డి, తల్లి సంధ్య అని, వారిద్దరూ తన చిన్ననాడే గుండెపోటుతో చనిపోయారని చెప్పింది. తన ఊరు కామారెడ్డి జిల్లా దోమకొండ అని చెబుతోంది. అయితే శివ అనే పేరుగల సోదరుడు సంగారెడ్డిలో ఉండేవాడని, వారి ఇంట్లోనే ఇంతకాలం ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. ఇక్కడ వసతి గృహంలో ఆహారం మంచిగా ఇస్తారు, బాగా చూసుకుంటారు అని చెప్పి ఇక్కడ వదిలి పెట్టినట్లు బాలిక చెబుతోంది. తన అక్క పేరు సరిత, బావ పేరు వెంకటరెడ్డి, తమ్ముడు రిత్విక్‌రెడ్డి అని మూడో తరగతి వరకు మేడ్చల్‌లోని దేవారాయాంజల్‌లో చదువుకున్నట్లు తెలిపింది. తల్లిదండ్రులు లేక బంధువులు వదిలేయడంతో బాలిక అనాథగా మారింది. ఈ బాలిక పూర్తిస్థాయి వివరాలు తెలిసే వరకూ మహిళా కానిస్టేబుల్‌ సహాయంతో అమీన్‌పూర్‌లో మహిమ మినిస్ట్రీ పిల్లల అనాథాశ్రమానికి పంపుతున్నట్లు పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని