ఎయిర్‌పోర్టు తరహా సౌకర్యాలే రైల్వే లక్ష్యం
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

ఎయిర్‌పోర్టు తరహా సౌకర్యాలే రైల్వే లక్ష్యం

అన్ని స్టేషన్లను తీర్చిదిద్దాలి: పి.కె.కృష్ణదాస్‌

రెజిమెంటల్‌బజార్‌, కాచిగూడ, న్యూస్‌టుడే: ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉండేలా రైల్వేస్టేషన్లను తీర్చిదిద్దాలని రైల్వే ప్రయాణికుల సదుపాయాల(ప్యాసింజర్స్‌ ఎమినిటీస్‌) కమిటీ ఛైర్మన్‌ పి.కె.కృష్ణదాస్‌ సూచించారు. కమిటీ సభ్యులు రాజేంద్రకుమార్‌ పడ్కె, ఉమారాణి, మధుసూదన, మంజునాథ, రవిచంద్ర, కైలాస్‌ లక్ష్మణ్‌ వర్మ కలిసి సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లలో శనివారం ఆయన తనిఖీలు చేశారు. ప్రయాణికుల వసతులు, సదుపాయాలు ఏవిధంగా ఉన్నాయనే విషయంపై ఆరా తీశారు. కృష్ణదాస్‌ను సికింద్రాబాద్‌ గణపతి ఆలయ కమిటీ సభ్యులు కలిశారు. రైల్వేస్టేషన్‌ నుంచి తాగునీటి సరఫరా లైన్‌ గణపతి ఆలయానికి ఉండగా బకాయిలు చెల్లించకపోవడంతో తొలగించారని, బిల్లు మాఫీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఐఆర్‌ఎస్‌డీసీ అధికారులతో సమావేశమయ్యారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ డైరెక్టర్‌ జయరాం, స్టేషన్‌ మేనేజర్‌ రాజనర్సు, ఆర్పీఎఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ గాంధీ, ఏడీఆర్‌ఎం హేమ్‌సింగ్‌ బానోతు, రైల్వే ఉన్నతాధికారులు అనురాధ, రాజ్‌కుమార్‌, కోటేశ్వర్‌రావు, శంకర్‌కుట్టి, జీషన్‌ అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని